ప్రమాదవశాత్తూ చీరకు నిప్పు అంటుకోవడంతో ఓ మహిళా టీచర్ అగ్నికీలలకు ఆహుతి అయింది. గురువారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. అడివీధిపాలెం ఉన్నత పాఠశాలలో అమిరిశెట్టి శ్యామల (45) టీచర్ గా పనిచేస్తున్నారు. స్వగ్రామం స్వర్ణలో వంట ప్రయత్నాల్లో ఉండగా ఆమె చీరకు నిప్పు అంటుకొని ఒళ్లంతా కాలిపోయి మృతి చెందారు.