ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడుని ఎన్నుకున్నత తరువాత.. స్పీకర్‌ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. తొలిస్పీచ్‌తోనే అదరగొట్టారు పవన్. సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటలను తెలియజేశారు. సభాద్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకెళ్లాలని అయ్యన్నను కోరారు. ‘ఇన్నాళ్లు మీ వాడి వేడితో కూడిన మాటలు విన్నాం.. ఇక మీ నుండి అలాంటి మాటలు లేకపోయినా బాధ్యతతో మార్గం చూపించే మాటలు వింటాం. 2047 నాటికి ఏపీ ఉన్నతంగా వుండాలి అంటే ఇప్పుడే దానికి పునాది వెయ్యాలి. విభేదించడం, వాదించడం చర్చకు మూల సిద్ధాంతాలు. అంతేగాని, దూషణలు, కొట్లాటలు కాదు. పొట్టి శ్రీరాములు చావుకు దగ్గర అవుతూ చేసిన ఒక్కో రోజు దీక్ష ఒకటిన్నర ఏళ్లుకు సమానం. మహానుభావుడు, బ్రతికినప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా అయన గుర్తుండాలి. ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు దిశా నిర్దేశం చేసేలా వుండాలి. పశువు, పక్షి, చెట్టు అన్నీ కూడా బావుండాలి అని కోరుకుంటూన్నాను.’ అని పవన్ ఆకాంక్షించారు.