అనంతపురంలోని రాజ్యాంగ పరిరక్షణ సమితి కార్యాలయంలో ఆదివారం వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు విద్యా సంస్థల ప్రవేశం కోసం రిజర్వేషన్ వర్గాలకు చెందిన కుటుంబాల పిల్లలకు అవసరమైన కుల, ఆదాయ, ఓబీసీ, స్థానికతకు సంబంధించిన పత్రాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వాలని రెవిన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.