ఏపీ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి కేబినెట్ భేటి నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం అవ్వనుంది.ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పాలన తీరుతెన్నులు ఎలా ఉండాలన్న దానిపై చంద్రబాబు సూచనలు అందించనున్నారు.ఎన్నికల హామీల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులు, మంత్రులతో చర్చించనున్నారు. అంతేకాకుండా, 8 కీలక శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది.