ధర్మవరం పట్టణం మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గొట్లూరు గ్రామానికి చెందిన పోతులయ్య అనే యువకుడు ఆదివారం గాయపడ్డాడు. ఈ క్రమంలో బాధితుడి కి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం మంగళవారం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa