రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ రెండు కేటగిరీలుగా విభజించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమం(ఆశ్రమ) పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, గణితం 726, ఫిజికల్ సైన్స్ 706, బయోలాజికల్ సైన్స్ 957, సోషల్ స్టడీస్ 1368, వ్యాయామ విద్య 1691, ఎస్జీటీ 6,341 పోస్టులున్నాయి. ఏపీ రెసిడెన్షిల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ, గిరిజన(గరుకులాలు), దివ్యాంగ, జువెనల్ విభాగాల్లో 2,281 పోస్టులున్నాయి. వీటిని జోన్ల వారీగా పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోస్టులు 266, జోన్-1లో 405, జోన్-2లో 355, జోన్-3లో 573, జోన్-4లో 682 పోస్టులు ఉన్నాయి.