శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలంలోని తండ్యాంపంచాయతీ తండ్యాంమెట్ట (ఎస్ఆర్ఎన్) కాలనీ దుర్గగుడిలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గుడిలోఉన్న హుండీని తీసుకువెళ్లి దానిలో నగదును దొంగిలించారు. హుండీలో సుమారు రూ.30 వేలు వరకు ఉంటుందని ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. హుండీలో నగదును దోచుకెళ్లిన దొంగలు హుండీని సమీపంలో ఉన్న పొలాల్లో విడిచిపెట్టారు. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దుర్గగుడిని పరిశీలించి కేసు నమోదుచేశారు.