జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గం పరిధిలో కలపర్రు టోల్‌గేట్ దగ్గర నుంచి గుండుగొలను వరకు రహదారిపై తరచు ప్రమాదాలు జరిగే కొమిరేపల్లి, సీతంపేట, దెందులూరు, వంగూరు, అమ్మపాలెం, వట్లూరు తదితర ప్రాంతా లను ఆర్డీవో ఎన్‌ఎస్‌కే.ఖాజావలి, తహసీల్దారు సూర్యప్రభ, హైవే అథారిటీ అధికారులతో కలసి సోమవారం పరిశీలించారు. హైవేపై ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. సర్వీస్ రోడ్లు లేకపోవడం కారణంకాగా, కొన్ని చోట్ల అండర్‌పాస్‌లు లేకపోవడం మరో కారణంగా గుర్తించామని చింతమనేని చెప్పారు. దీనిపై సమీక్షించి, పూర్తిస్థాయిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.