తాగునీటి సమస్యను పరిస్కరించాలని కురుపాం మండలం తోలుగూడ గ్రామానికి చెందిన మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెల తో ధర్నా చేశారు. తమ గ్రామంలో బోరుబావిని ఏర్పాటు చేయాలని కోరినా గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజా సమస్య పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రాలు అందించారు. అదేవిధంగా కాకలి సెంటర్ నుంచి లిక్కిడి సెంటర్ వరకు రహదారిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గంగునాయుడు, సన్యాసి, కొల్లి సాంబమూర్తి తదితరులతో పాటు ఆయా గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.