ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో జరిగిన పనులకు సంబంధించి ఆడిట్ బృందం ఆడిట్ చేస్తున్నందున జరిగిన పనులకు సంబంధించిన వివరాలు వారికి అందించాలని ఎంపీడీవో, శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వేమూరు మండల పరిధిలోని బలిజేపల్లి, వరాహపురం గ్రామాల్లో ఉపాధి హామీ ఆడిట్ కు సంబంధించి గ్రామసభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరిగిన పనుల వివరాలు, ఖర్చైనా నిధులు వివరాలు వారికి తెలియజేయాలన్నారు.