బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనీ విద్యానగర్ లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అక్రమ కట్టడం అని మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. సంబంధిత అధికారులను సంప్రదించి కార్యాలయం నకళ్ళను అందజేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు సూచించినట్లు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మీడియాకు తెలిపారు. నోటీసులు జారీపై మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అధికారులను కలవనున్నట్లు వారు పేర్కొన్నారు.