అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ ఇంకా 3జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండగా 30జీబీ డాటా కోసం 1200 AFNలు చెల్లించాల్సిందే. నిన్న ఆస్ట్రేలియాపై అఫ్గాన్ టీమ్ గెలుపొందడంతో ఆ దేశ రాజధాని కాబూల్ నగరంలో అభిమానులు సంబరాలు చేసుకున్న ఫొటోలు వైరలయ్యాయి. వాటిలో ఉన్న ఇంటర్నెట్ ఛార్జీల ప్రకటనతో ఈ విషయంపై చర్చ మొదలైంది. ఇండియాలోనే బెటర్ అని పోస్టులు పెడుతున్నారు.