పులివెందుల కూరగాయల మార్కెట్ కు మున్సిపాలిటీ కౌన్సిల్ ఆమోదం లేకుండా కూటమి నాయకులు పేరు మార్చడం సరైన పద్ధతి కాదాని మున్సిపల్ ఛైర్ మెన్ వరప్రసాద్, వైస్ చైర్ మెన్ వైఎస్ మనోహర్ రెడ్డి లు అన్నారు. బుధవారం ఆయన ఇంటి వద్ద మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూరగాయల మార్కెట్ ను గత ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అప్పట్లో ఉన్న వ్యాపారులు, ప్రజలు మార్కెటు వైఎస్ఆర్ పేరు పెట్టాలని విన్నవించారన్నారు.