వేముల మండలంలో జరుగుతున్న అమరావతి ఎక్సెస్ హైవే కి సంబంధించిన పనులకు ఎటువంటి అనుమతులు పొందకుండా మట్టి తరలిస్తున్నారనే ఫిర్యాదుతో బుధవారం మైనింగ్ అధికారులు దాడులు చేశారు. గొల్లలగూడూరు, చింతలజూటూరు గ్రామాలలో జరుగుతున్న హైవే పనులకు అనుమతులు లేకుండా గ్రామాల్లో మట్టి తరలిస్తున్నారనే ఫిర్యాదుతో మైనింగ్ అధికారులు దాడులు చేసి 8 టిప్పర్లను అడ్డుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.