ప్రపంచ దేశాలలో భారత దేశాన్ని ఒక అద్భుత శక్తిగా నిలిపిన ఘనత దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకే దక్కుతుందని రుడా మాజీ ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా శుక్రవారం రాజమండ్రిలోని ఆంధ్ర కేసరి కళాశాల ప్రాంగణంలో సభను నిర్వహించారు. తొలుత పీవీ నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.