ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ దారులకు లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని అందులో పేర్కొన్నారు. ‘మీ అందరి మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. మీ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం. ఎన్నికలకు ముందే మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్‌ను ఒకేసారి రూ. 1000 పెంచాం. ఇకపై రూ.4000 పెన్షన్ ఇస్తాం. దివ్యాంగులకు రూ.3000 పెంచి, ఇకపై రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది అని’ చంద్రబాబు అభిప్రాయపడ్డారు.