కర్నూలు నగరంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విద్యుత్‌శాఖ అధికారు లను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి టీజీ. భరత్ ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన ఏపీఎస్పీడీసీఎల్ కర్నూలు టౌన్ డివిజన్ అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. నగరంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల పై మంత్రి చర్చించారు. ప్రధానంగా ఓల్డ్‌సిటీలో విద్యుత్ సరఫరాలో ఇబ్బం దులు ఉన్నాయని, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలను సరిచే యాలని షార్ట్‌సర్య్కూట్ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్థంభాలను మార్చాలని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మెయింటెనెన్స్ బాగుండాలన్నారు. ప్రభు త్వాసుపత్రిలో విద్యుత్ కోతల వల్ల పేషంట్ల ప్రాణాలకే ప్రమాదం పొంచిఉందన్నారు. ఆసుపత్రిలో విద్యుత్ నిర్వహణ సరిగా లేదని తన దృష్టికి వచ్చిందని ఆసుపత్రి అధికారులతో చర్చించి సమస్యను పరిస్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశిం చారు. వాటర్‌వర్క్ వద్ద 33కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చే సేందుకు 10 సెంట్ల స్థలం అవసరం అవుతుందని ఇందు కోసం మున్సిపల్ అధికారులతో మా ట్లాడతామన్నారు. కార్యక్రమంలో ఉమ్మ డి కర్నూలు జిల్లా ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ఎం. ఉమాపతి, టౌన్ డివిజన్ ఈఈ పి. ఓబులేసు, కన్‌స్ట్రక్షన్ ఈఈ రాజేష్, టౌన్ ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.