నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతి దివిటివారిపల్లి సమీపంలో భర్తే కాలయముడై భార్యను హతమార్చాడు. దీనికి సంబందించి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కార్తికేయపు రంలో నివాసం ఉంటున్న సాలమ్మ, రంగయ్యల కుమార్తె భారతి(22)కి పలమనేరుకు చెందిన గణపతితో 4ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కాగా భార్యపై అనుమానంతో భర్త నిత్యం వేదింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేక కొంతకాలం భర్తకు దూరంగా ఉంటున్న భారతి నెల్లురు జిల్లా కొవ్వూరుకు చెందిన రవిని వివాహం చేసుకొంది. దీంతో మొదటి భర్త గణపతి మరొక మహిళను వివాహం చేసుకొని తన మొదటి భారతి పిలల్లతో వేరుగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తన సంసారానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని రెండవ భార్య గణపతిని కోరింది. దీంతో మొదటి భార్య భారతికి ఫోన చేసి పిల్లలను చూసేందుకు రావాలని కోరగా గురువారం భారతి రాగానే ఇద్దరు కలిసి నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె పంచాయతి దివిటివారిపల్లె మామిళ్లగుట్ట సమీపంలోని పొలం వద్ద వున్న గుడిసె వద్దకు వెళ్లారు. దివి టివారిపల్లెకు చెందిన బాలె రామాంజులు పంటపొలానికి నీరు కట్టేం దుకు పొలం వద్దకు వచ్చాడు. గుడిసెలో శబ్దాలు వస్తుండడంతో రామాంజులు పరుగున రావడంతో అప్పటికే భార్య భారతీని హత మార్చి కోపోద్వేగంలో గణపతి రామాంజులుపై కత్తితో గొంతుపై కోసి అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన గ్రామస్థులు రామాంజులును మదనపల్లె ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్‌పీ ప్రసాద్‌రెడ్డి, సీఐలు సద్గురుడు, వలీవసు, యువరాజ్ ఎస్‌ఐలు మల్లిఖార్జునరెడ్డి చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లా క్లూస్‌టీమ్ ఎస్‌ఐ రవీంద్రారెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి సెల్‌ఫోన ఆధారంగా హతురాలి వివరాలను సేకరిం చామన్నారు. నిందుతుని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.