రేషన్ సరఫరా వ్యవస్థలో తేడాలు రాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులపై వుందని పల్నాడు జేసీ శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం పిడుగురాళ్ల పౌరసరఫ రాలశాఖ గోడౌన్‌ను జేసీ ఆకస్మిక తనిఖీచేశారు. రికార్డులు, నిల్వల పరిశీలనతో పాటు బియ్యం బస్తాలను తూకాన్ని గుర్తించారు. ప్రతిబస్తా తూకంవేసి డీలర్లకు ఎగుమతి చేసేలా చూడాలన్నారు. కార్డుదారులకు సక్రమంగా పంపిణీ అయ్యేవిధంగా చూడాలని, సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులపై వుందన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో పద్మశ్రీ, ఆర్డీవో రమణా కాంత్‌రెడ్డి, పిడుగురాళ్ల తహసీల్దార్ శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.