ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాలను నోటిఫై చేస్తూ సీఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. నేలపాడు, రాయపూడి, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించనుంది. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవ్వగా.. మిగితా వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.