నిరుపేదల కళ్లలో ఆనందమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరదేవి అన్నారు. సోమవారం చోళసముద్రం గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేశారు. వృద్ధులకు పంపిణీ చేస్తున్న రూ. 7వేలు పింఛన్లను స్వయంగా ఆమె చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదల కళ్లలో ఆనందం కోసం టీడీపీ ప్రభుత్వం ఎల్లవేళలా కృషిచేస్తుందన్నారు. అనంతరం పెన్షన్ల పంపిణీ చేపట్టారు.