రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆదివారం రాత్రి, సోమవారం పలు గ్రామాల్లో ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలోని ప్రధాన సెంటరు సమీపంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గతంలో మండలంలోని గొల్లగూడెం పంచాయతీపై యువగళం జెండా ఎగురవేశారు. ఈడుపుగల్లు, కంకిపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఉప్పలూరులో సచివాలయ భవనంపై ఉన్న వైయస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన బోర్డును పగులగొట్టారు.