పరిసరాల పరిశుభ్రత, నిల్వ నీరు లేకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించి సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారిద్దామని డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహనాయక్ పిలుపునిచ్చారు. సోమవారం కాకినాడ జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో డెంగీ వ్యతిరేక మాసోత్సవం పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ డెంగీ మాసోత్సవాలు జూలై 1 నుంచి 31 వరకు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఇంచార్జి జోనల్ అధికారి డాక్టర్ ఆర్.రమేష్ పాల్గొన్నారు.