దోమల వ్యాప్తిని అరికట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని శ్రీకాకుళం కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ అన్నారు. సోమవారం నుంచి 31 వరకు డెంగ్యూ మాసోత్స వాల సందర్భంగా సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు డెంగ్యూ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఈ వ్యాధి దోమకాటు ద్వారా వ్యాపిస్తుందని, ప్రతీ ఒక్క రూ దోమతెరలను వాడాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డేగా పాటించాలని, ఇంటిలో వాడని పాత్రల్లో నీటి నిలువలు ఉండ కుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.బి. మీనాక్షి, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ జగన్మోహన్‌రావు, డీఐవో శ్రీదేవి, డీపీఎంవో డాక్టర్ జీవీ లక్ష్మి, మున్సిపల్ హెల్త్ అధికారి వెంకటరావు, సంఘ సేవకుడు మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.