గుత్తి మండలం బసినేపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఆటో బోల్తా పడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రి చెందిన రాజగోపాల్, ప్రతాప్, రంగా ముగ్గురు తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాన్వేషణకు ఆటోలో వెళ్ళి తిరిగి వస్తుండగా బసినేపల్లి గ్రామ శివారులో ఆటో అదుపుతప్పి బోల్తాపడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |