వైద్యరంగంలో ఆయుష్ డాక్టర్లను కూడా భాగస్వాములను చేయాలని ఎస్పిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం తొండూరు లో ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన ఆయుష్ డాక్టర్లు ప్రభుత్వపరంగా తగు ప్రోత్సాహం లభించకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆయుష్ డాక్టర్లను భాగస్వాములుగా చేర్చుకోవాలని ఆయన కోరారు.