AP: త్వరలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. డీఎస్సీ, టెట్ సిలబస్‌లో మార్పులు జరిగాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. సిలబస్ మార్పు జరిగిందని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. సిలబస్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం." అని మంత్రి తెలిపారు.