ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జులై 8వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి.. ఆ కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా చార్జీలను నిర్ణయించనున్నారు.
![]() |
![]() |