2014 టీడీపీ ప్రభుత్వంలో మల్లవల్లి పారిశ్రామికవాడలో 478కంపెనీలకు స్థలాలు కేటాయించారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎన్ని కంపెనీలు నడుస్తున్నాయో వైసీపీ నేతలు చెప్పాలి అని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అయన మాట్లాడుతూ..... మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జగన్ ప్రభుత్వం వీరపనేనిగూడెం, మల్లవల్లి పారిశ్రామికవాడలను గాలికి వదిలేసింది. నియోజకవర్గ ప్రజలు వలస వెళ్లే దుస్థితి లేకుండా వారికి ఇక్కడే ఉపాధి కల్పించేలా చంద్రబాబు సర్కార్ చూసుకుంటుంది. త్వరలోనే కొన్ని కంపెనీలు తెచ్చేందుకు మంత్రి భరత్ ముందుకు వచ్చారు. మల్లవల్లి ఇండస్ట్రీ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హమీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి భరత్ సహకారంతో పారిశ్రామికవాడను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలుపుతా" అని ధీమా వ్యక్తం చేశారు.
![]() |
![]() |