మెకానిక్ల సమస్యలను పరిష్కరించాలని టూ వీలర్ వర్కర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గాంధీ, రాము, బాబులు ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కోరారు. బుధవారం మెకానిక్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అదితిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టూ వీలర్స్ వెల్ఫేర్ మెకానిక్ బోర్డుని ఏర్పాటు చేయాలని, మెకానిక్లకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి టూ వీలర్ మెకానిక్కు కార్మికశాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. మెకానిక్లకు ఉపాధి కల్పించేందుకు ష్యూరిటీ, వడ్డీలేని రూ.3 లక్షలు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, తద్వారా తాము ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు రఘు, షకీల్, సత్తార్, సురేష్, రవి, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు.