ప్రపంచ టూ వీలర్ మెకానిక్ డే వేడుకలను బుధవారం బొబ్బిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజా కళాశాల రోడ్డులో చల్లపల్లి మురళీకృష్ణ వర్క్‌షాపులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీనాయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. మెకానిక్లందరికీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. సీనియర్ మెకానిక్‌లను ఘనంగా సన్మానించారు. అనంతరం బొబ్బిలి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు వంగపండు మహేశ్, చల్లపల్లి మురళీకృష్ణలు కోరారు. వీరి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానని బేబీనాయన హామీ ఇచ్చారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, గున్నతోటవలస సర్పంచ్ సింగనపల్లి ఈశ్వరరావు, దిబ్బగుడ్డివలస ఎంపీటీసీ వెన్నెల నాగరాజు, మెకానిక్ సంఘ నాయకులు సాయి, కోసూరు ఆనందరావు, పరిమిశెట్టి సుబ్బారావు, చిటికెల బుజ్జి, కడగర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.