గజపతినగరం నియోజకవర్గంలో చిన్నపరిశ్రమలు ఏర్పాటుచేసి వలసల నివారణ అరికట్టేవిధంగా ప్రణాళికలను రూపొందించనున్నట్లు చిన్న తరహా , సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం గజపతినగరంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్టాభివృద్ధికోసం చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఈనెల ఒకటోతేదీన నేరుగా అధికారులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 96 శాతం పింఛన్లు పింపిణీ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 15వతేదీవరకు జీతాలు పడక ప్రభుత్వోద్యోగులు తీవ్ర ఆర్థికఇబ్బందులు పడేవారని, అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఈనెల ఒకటో తేదీన జీతాలు వేశారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించే దిశగా తక్షణ చర్యలతోపాటు దీర్ఘకాలికప్రణాళికలు చేపడతామన్నారు. నియోజకవర్గ సమ స్యలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అనంతరం దత్త్తిరాజేరు మం డలంలోని ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన మత్యనారాయణతోపాటు 50 కుటుంబాలు టీడీపీలో చేరడంతో మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, దత్తిరాజేరు, బొండపల్లిపార్టీ మండలాధ్యక్షులు చప్పా చంద్రశేఖర్, కోరాడ కృష్ణ, నాయకులు శీరం రెడ్డిరామ్‌కుమార్,ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.