ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పనులు కల్పించాలని వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు కోరారు. బుధవారం సాలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో ఎని మిది వారాలుగా బకాయి ఉన్న వేతనాలు ఉపాధి కూలీలకు చెల్లించాలని కోరా రు. వ్యవసాయపనుల్లో యంత్రీకరణ పెరిగిపోవడంతో కూలీలకు పనులకు దొరక్కపోవడంతోకూలీలు వలసలు వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు రూ. 400 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అడ్మిస్ట్రేషన్ ఆఫీసర్ పార్వతికి వినతిపత్రం ఇచ్చారు.కార్యక్రమంలో గాసి,ఈశ్వరరావు పాల్గొన్నారు.