భార్యను వేధిస్తున్న భర్తపై కొత్తగా తీసుకొచ్చిన బీఎన్ఎస్ చట్టం సెక్షన్85, 115(2) రెడ్ విత్ 3(5)ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం, తుమ్మలపాలెం గ్రామానికి చెందిన పాము నూకరాజు కుమార్తె మనీషాకు మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామానికి చెందిన ఉగ్గిన రాంబాబుతో వివాహం చేశారు. తన అల్లుడు రాంబాబు తన కుమార్తెని సక్రమంగా చూసుకోకుండా తరచూ వేధిస్తూ కొడుతున్నాడు. ఈ విషయం తెలిసి అప్పన్నదొరపాలెం గ్రామంలోని అల్లుడి ఇంటికి మంగళవారం వచ్చి అడిగినందుకు కొట్టాడు. తనను తనభర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య మనీష చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.