విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 118 మొబైల్స్‌ను బాధితులకు సైబర్ క్రైమ్ పోలీసులు అప్పగించారు. బుధవారం ఎస్పీ దీపిక ఆదేశాలతో సోషల్ మీడి యా సైబర్ సెల్ సీఐ విజ య్‌కుమార్ సైబర్ పోలీస్ స్టేషన్ వద్ద బాధుతుల ఆధారాలు సేకరించి వారి మొ బైళ్లను అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యా ప్తంగా పోగొట్టుకున్న మొబైల్స్ గురించి ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే 118 మొబైళ్లను ట్రేస్ చేశామన్నారు. ఆన్‌లైన్ ద్వారా సైబర్ పోలీస్ స్టేషన్‌లో నేరుగా ఫిర్యాదులు స్పీక రించి వాటిని ట్రేస్ చేసి అందజేశామన్నారు. 11మంది నేరస్తులు గంజాయి అక్రమ రవాణ హత్యలు, ఇతర నేరాలు చేసేందుకు మొబైళ్లను వినియోగించుకున్న తరువాత మొబైళ్లను పారవేస్తారని ఎవరైనా వాడినట్లయితే పోలీసులు, కోర్టుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నారు. దొరికిన మొబైళ్లను స్టేషన్‌కు అప్పగించడం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ ఎస్సైలు ప్రశాంత్‌కుమార్, నసీమా బేగమ్, పీసీలు తిరుపతి, శ్రీనివాసరావు, రాజేష్, శిరీష సిబ్బంది పాల్గొన్నారు