సచివాలయ సిబ్బంది నిర్దేశ సమయానికి విధులకు హాజరుకావాలని ఎంపీడీవో సుబ్బరాజు సూచించారు. బుధవారం ఉరవకొండ పట్టణంలోని 3, 5 సచివాలయాలతో పాటు మండల పరిధిలోని బూదగవి సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హాజరు పుస్తకాన్ని పరిశీలించి బయోమెట్రిక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సమయపాలన పాటించాలని, కార్యాలయ వేళల్లో ప్రజలకు అందుబాటులో సేవలందించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa