నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు. అయితే వారిని ఆళ్లగడ్డలోని శిల్పాకళా మందిరం దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఇంకా ఎంతమంది ఉన్నారన్నదానిపై విచారణ చేస్తామని, ఫిజికల్‌గా అయితే ఈ ఘటనలో ఆరుగురు మాత్రమే పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి, వీడియో, సాక్షులు ఉన్నారని పోలీసులుపేర్కొన్నారు.