టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. అప్పటిలో చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసులో ఆయన కుడి కన్ను కోల్పోయిన విషయం తెలిసిందే. కుడి కంటి చూపు కోల్పోవడంతో అప్పట్లో గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చికిత్స చేయించారు. అయినప్పటికీ చూపు రాదని వైద్యులు తేల్చిచెప్పేశారు. ఈ క్రమంలో ఈ కేసును రీ ఓపెన్ చేయాలని టీడీపీ నేతలు కోరారు.