దేశంలోని 10 నగరాల్లో ఏటా వాయుకాలుష్యంతో దాదాపు 33వేల మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ నివేదిక వెల్లడించింది. స్వచ్ఛమైన వాయు ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచించిన ప్రతీ క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. కాలుష్యం బారి నుంచి దేశ పౌరులను రక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించాలని ఆ నివేదిక సూచించింది. 10 నగరాల్లో PM 2.5 ఎక్స్‌పోజర్, 2008-2019 మధ్య రోజూ వారీ మరణాల గణాంకాలతో డేటా రూపొందించారు. ప్రస్తుతం తక్కువ స్థాయి వాయు నాణ్యత దేశంలో రోజువారీ మరణాల రేటును పెంచుతోందని అధ్యయనం కనుగొంది. 10 నగరాలైన.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణె, సిమ్లా, వారణాసిలో సంవత్సరానికి 33 వేల మరణాలు చోటు చేసుకుంటున్నాయని నివేదిక పేర్కొంది.