గుంతకల్లు పట్టణంలోని బిసి బాలుర వసతి గృహాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. వసతి గృహంలో తాగునీరు ఏర్పాటు, మరుగుదొడ్ల వసతి వంటి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. వసతి గృహంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. భోజనాన్ని నాణ్యంగా విద్యార్థులకు అందించాలని హాస్టల్ వార్డెన్ ను ఆదేశించారు. ఆయనతో పాటు అసిస్టెంట్ సిటీ ప్లానర్ అన్నారు.