నీట్–యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల విద్యార్థులకు వాటిల్లిన నష్టం, పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యా ర్థి సంఘాల ఐక్య వేదిక(స్టూడెంట్ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్ ఏలూరు జిల్లాలో విజయవంతమైంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలను స్వచ్ఛందంగానే మూసివేయగా, ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలల వద్దకు విద్యార్థి సంఘాల బృందాలు వెళ్లి మూసి వేయించా యి. ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద ధర్నా చేశారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.నాని మాట్లాడుతూ ప్రశ్నా పత్రం లీకేజీపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయలేని స్థితిలో ఉండడం దురదృష్టకరమన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, పీడీఎస్‌వో జిల్లా కార్యదర్శి ఎస్.మోహన్ మాట్లాడారు.