పిఠాపురం నియోజకవర్గంలోని ఏదొక ప్రాంతంలో స్థలం కొని ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా అని ఎన్నికల ముం దు చెప్పిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన సొంత ఇల్లు, కార్యాలయం నిర్మాణంకోసం పిఠాపురం పట్టణ శివారు ఇల్లింద్రాడ సమీపం లో గొల్లప్రోలు వైపు వెళ్లే 216వ జాతీయ రహదారిలో పుంతరోడ్డును చేర్చి 3.52 ఎకరాలను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను బుధవారమే పూర్తి చేసి ఆ విషయాన్నే పిఠాపురం లో జరిగిన వారాహి సభలో ప్రకటించా రు. అక్కడే ఇల్లు కట్టుకుంటానని, రెండెకరాల్లో కార్యాలయం నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అంతే ఈ సమాచారం పిఠాపురం నియోజకవర్గంతోపాటు ఉభయగోదావరి జిల్లాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. పవన్ పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటున్నారనే సమాచారం సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌గా మారింది.