గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో ధార్మిక క్షేత్రాన్ని.. అధార్మిక క్షేత్రంగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... టిక్కెట్లు, గదులు, ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి రాజ్యమేలిందన్నారు. శ్రీవారి ఆభరణాలు భద్రమేనానన్న అనుమానం భక్తుల్లో కలుగుతోందని అన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా శ్రీవారి ఆభరణాలను తనిఖీ చెయ్యించి.. భక్తుల అనుమానాలను నివృత్తి చెయ్యాలని డిమాండ్ చేశారు.