మైలవరం మండల పరిధిలోని చిన్న కొమెర్ల గ్రామ సమీపంలోని ఓ సిమెంటు పరిశ్రమ వద్ద ఉన్న లారెన్స్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన 9 లారీల అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. లారెన్స్ ట్రాన్స్ పోర్డు మేనేజర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం ఎస్ఐ హనుమంతు తెలిపారు.