మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం మాడుగుల మండలం పెద్దేరు జలాశయాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా అధికారులతో కలిసి ఆయన జలాశయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా జలాశయం గేట్లు మరమ్మతుకు గురయ్యాయని, కాలువలు పూడికపోయాయని ఆయకట్టు దారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మతుకు చర్యలు చేపట్టాలని ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.