తిరుపతి అర్బన్ తహశీల్దార్ కార్యాలయాన్ని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కలెక్టరేట్లోని రెవెన్యూ పరిపాలన యంత్రాంగంలోని పలు సెక్షన్లను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ప్రజాసమస్యల పరిష్కార వేదిక సంబంధించిన ఫిర్యాదులలో పరిష్కరించిన వాటిపై వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారం అర్థవంతంగా, నాణ్యతగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.