విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొ న్నారు. ఆదివారం కదిరిలోని బాలికల పాఠశాల ఆవరణలో ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, జీఓలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాయన్నారు. నూతన ప్రభుత్వం సత్వర నిర్ణ యాలతో గాడిలో పెట్టాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa