అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాలలో ఆయా గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో నియోజకవర్గ వైయస్సార్ పార్టీ సమన్వయకర్త హనిమిరెడ్డి పాల్గొని రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.