నదుల అనుసంధానం సృష్టి కర్త సీఎం చంద్రబాబు అని, 2014 లోనే ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. కృష్ణా డెల్టాను కాపాడి రైతుల ఇంట్లో పండుగ తెచ్చారని, జగన్ వచ్చాక పట్టిసీమను పడుకోపెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఐదేళ్లల్లో రైతులు ఇబ్బందులు పడ్డారని, దేవినేని ఉమ అప్పట్లో ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టును పూర్తి చేయించారన్నారు. పవిత్ర సంగమం వద్ద గతంలో లాగా హారతులు కార్యక్రమం చేపట్టాలని, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలన్నారు. పట్టిసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుందని, చంద్రబాబు ముందు చూపుకు అన్నదాతల్లో ఆనందం వెల్లి వెరిస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు.