ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. దీక్ష, దక్షతకు, సీఎం చంద్రబాబు ముందుచూపుకు పట్టిసీమ నిదర్శనం అని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరవు నిర్మూలించవచ్చని కెయల్ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు. గోదావరి నుంచి మూడు వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వదులుతున్నారని, వృధా అవుతున్న నీరుని కృష్ణాడెల్టా కు మళ్లించారని చెప్పారు.